13 July, 2026 | 2:38 AM

‘సర్’ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి

13-07-2026 01:37 AM

-మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ 

హనుమకొండ, జూలై 12 (విజయక్రాంతి): సర్ ప్రక్రియపై నిరంతరం అప్రమత్తతతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ బాధ్యులతో ఆదివారం రోజున సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ కీలకమైన దశకు  చేరుకుందని అన్నారు.

ఎన్నుమరేషన్ ఫామ్స్ ఓటరులకు చేరాయని, వాటిని ఓటరు వివరాలతో పూర్తి చేసిన ఫామ్స్ బీఎల్వో లకు అందే విధంగా పార్టీ బీఎల్‌ఏ లు పని చేసేలా చూడాలని సూచించారు. హెల్ప్ డెస్క్ కు మంచి స్పందన వస్తోందని, ఓటర్లకు మరింతగా అందుబాటులో ఉండాలని కోరారు. డివిజన్ల వారీగా ఎస్‌ఐఆర్ ఏ మేరకు సాగుతుందో అన్న విషయంపై సమాచారాన్ని సేకరించాలని అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తెలపాలని కోరారు. కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ బాధ్యులు మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు పోలపల్లి రామ్మూర్తి, బైరపాక ప్రశాంత్, గండ్రకోట రాకేష్ యాదవ్, తక్కళ్ళపల్లి వినీల్ రావు, తదితరులు పాల్గొన్నారు