13 March, 2026 | 6:16 AM

దళితవాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భావం

13-03-2026 01:08 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : కాంగ్రెస్ క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు దళితులు పార్టీకి అండగా నిలిచారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్న ది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆయన తెలిపారు. దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు సముచిత స్థానం కల్పించిందని, దళిత వా దంతోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిందన్నా రు.

పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం గాంధీభవన్‌లో బాధ్యతలు తీసుకు న్నారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కవ్వంపల్లిపై ఉన్న నమ్మ కంతోనే బరువైన బాధ్యతను పెట్టామని, పార్టీని మరింత బలోపేతం చేస్తాడనే నమ్మ కం ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రా జయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి కేసీఆర్ ఎలా తొలగించారో అందరికి తెలుస న్నారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ నియోజక వర్గాల్లో కవ్వంపల్లి సూచించిన వారికి ఎమ్మె ల్యే, ఎంపీ టికెట్లు కేటాయించడం జరుగుతుందని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు.

బీఆర్‌ఎస్ నాలుగు ముక్కలైంది.. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు..100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీలకు అ న్నింటిలో 18 శాతం రిజర్వేషన్ కల్పించడం తో పాటు బడ్జెట్‌లోనూ, కార్పొరేషన్ పదవుల్లోనూ18 శాతం కేటాయించా లని రాష్ట్ర మంత్రి వివేక్ అన్నారు. దళితుల వల్లే కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నా రు. 

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి విద్య ఒక్కటే ప్రధానమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎస్సీల్లోని 59 కులాలను ఏకతాటికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి తనపై ఈ బాధ్యత పెట్టారని ఎస్సీ విభాగం అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. దళిత వర్గాల ఎమ్మెల్యేలు నెలకోసారి సమావేశమై సమస్యలపై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సూచించారు.