2 June, 2026 | 4:31 AM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం

02-06-2026 12:29 AM

ఎమ్మెల్యే కశిరెడ్డి

ఆమన్గల్, జూన్ 1(విజయక్రాంతి):పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ శాంతినగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఆయన ప్రారంభించి,లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకలని, పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రెహానా బేగం, రంగయ్యల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మాజీ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, ఏఎంసీ డైరెక్టర్లు  సంపత్ కుమార్, రవీందర్, నాయకులు కాలే మల్లయ్య, కృష్ణ నాయక్, శ్రీకాంత్, ప్రసాద్, ఫరీద్, సలీం లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పేదల ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పేదల ప్రభుత్వమని, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపల్ కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లుండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూ. 20 వేల కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.కల్వకుర్తి నియోజకవర్గానికి రెండో విడతలో మరో 1500 ఇళ్లను కేటాయించామని, జూన్ నెల నుండి వీటి మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ. 1000 కోట్లు మంజూరు చేయడంతో పాటు, గ్రీన్ఫీల్ రోడ్డు వెడల్పు బాధితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశామని వివరించారు.

అంతకుముందుమున్సిపాలిటీలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జగన్, మానయ్య, ఏఎంసి వైస్ చైర్మన్  భాస్కర్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్లు  సంపత్ తాళా రవి తదితరులు పాల్గొన్నారు.