2 June, 2026 | 5:08 AM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

02-06-2026 12:30 AM
  1. బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
  2. పార్టీ మేడ్చల్ ఇంచార్జ్ లక్ష్మారెడ్డి

ఘట్ కేసర్, జూన్ 1 (విజయక్రాంతి) : మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టిఆర్‌ఎస్ మేడ్చల్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ నియోజకవర్గం ఘట్ కేసర్ సర్కిల్ పోచారం, ఘట్కేసర్, ఎదులాబాద్ డివిజన్ ల బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం అన్నోజీగూడ లోని తులిప్స్ హోటలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, చామకూర మహేందర్ రెడ్డి విచ్చేసి బూత్ కమిటీ సభ్యులకు నూతన డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ ఐ ఆర్ (ఓటర్ల జాబితా సవరణ) అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో అధికారం కోల్పోవడం తాత్కాలికమేనని, విపక్షంలో ఉండే ఈ సమయం పార్టీ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం గురించి ఈ సమావేశంలో చర్చించి బూత్ సాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్  బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లు రెడ్యానాయక్, పలుగుల మాధవరెడ్డి, నాయకులు మందడి సురేందర్ రెడ్డి, డొంకిని బిక్షపతిగౌడ్, నాగులపల్లి రమేష్, పన్నాల కొండల్ రెడ్డి,  బద్దం జగన్మోహన్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, నర్రి కాశయ్య, అబ్బవతిని నరసింహ, రోడ్డ యాదగిరి,  పోత్నకని మల్లికార్జున రాజు, మాజీ  సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ కౌన్సిలర్లు, బూత్ కమిటీ సభ్యులు, క్రియాశీల కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.