ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం
పుల్లూరులో గృహప్రవేశాలకు హాజరైన ఆత్మ కమిటీ చైర్మన్ గోపీకృష్ణ
సిద్ధిపేట రూరల్, జూలై 12:పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులకు ఇళ్లు అందుతున్నాయని సిద్ధిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ అన్నారు. సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన గొడుగు శ్యామలయాదగిరి, గొడుగు రవి కుటుంబాలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి కుటుంబ సభ్యులతో కలిసి ప్రవేశించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఐరెని అంజిరెడ్డి, జనార్దన్ రెడ్డి, అజ్మత్, వహబ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటుకుల అనిల్ రెడ్డి, సేవాదళ్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బచాయిపల్లి సర్పంచ్ గిరి, ఉడుత కుంటయ్య, ఎల్లారెడ్డి, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.






