13 July, 2026 | 1:19 AM

‘సర్’ను పరిశీలించిన ఎమ్మార్వో

13-07-2026 12:22 AM

కొండపాక, జులై 12: కొండపాక మండల కేంద్రంలో సర్ నమోదు ప్రక్రియ బీఎల్వోల పనితీరును తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్వోలకు సూచించారు.

ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా చేపట్టి, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల్లో మార్పులు, చిరునామా సవరణలు, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఓటరు జాబితాను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఖచ్చితమైన వివరాలతో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు  సులభంగా, వేగంగా  బీఎల్వోలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జిపిఓ శ్రీనివాస్ రెడ్డి, అంబటి బాలచందర్ గౌడ్, స్థానిక బిఎల్ ఓ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.