13 July, 2026 | 2:15 AM

లక్ష కోట్లు ఎక్కడ?

13-07-2026 01:21 AM
  1. కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ!
  2. కేసీఆర్ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌కు రహస్య సంబంధాలు
  3. కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుం బం నుంచి లక్ష కోట్ల రూపాయలు వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఆ హామీ ఏమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబస భ్యులతో రేవంత్‌కు రహస్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ సంస్థలు లేవా? లేక విచార ణను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందా? అని నిలదీశారు.

బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. ఆదివారం హైదరాబా ద్‌లోని అంబర్‌పేట్ నియోజకవర్గంలో పా దయాత్ర అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజు లపాటు సింగరేణి భరోసా యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి శని, ఆదివారం బస్తీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని వెల్లడించారు. 

హామీలేమయ్యాయి?

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు రూ.4 వేల భృతి, యువతులకు స్కూటీలు, వివాహ సమయంలో తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైటెక్ సిటీ అభివృద్ధికే పరిమితమైందని ఆరోపించారు. సికింద్రాబాద్, అంబర్‌పేట్, సనత్‌న గర్, గౌలిగూడ, ఓల్ సిటీ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవ ర్గంలోని పలు డివిజన్లలో బస్తీలను సందర్శిస్తూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్య లను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అనేక రహదారులు దెబ్బతిన్నాయని, వీధిలైట్లు పనిచేయక బస్తీలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా లైట్ల మరమ్మతులు, మార్పిడి పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు.

తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, వర్షాకాలం వచ్చినప్పటికీ వేసవిలో ఉన్నట్లుగానే చివరి బస్తీలు, ఇళ్ల వరకు తాగునీరు అందడం లేదని, దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం, పెన్షన్ల మంజూరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలమైనా అర్హులకు పెన్షన్లు అందడం లేదని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా ప్రయోజనం లేకపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.