13 July, 2026 | 1:49 AM

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారం

13-07-2026 12:45 AM

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

దామరచర్ల, జులై 12: ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంతోనే పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. దామరచర్ల మండలం లోని మంగళ్ దుబ్బ తండా కె జె ఆర్ కాలనీలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన సొంత నివాసం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగు నాయక్ ,రవి తేజ ,సర్పంచ్ సిద్దు నాయక్ అధికారులు, లబ్ధిదారులు గ్రామస్థులు పాల్గొన్నారు...