13 July, 2026 | 2:29 AM

లార్డ్స్‌లో విజయం దిశగా భారత్

13-07-2026 01:47 AM

ఇంగ్లాండ్ టార్గెట్ 457, ప్రస్తుతం 139/6

భారత్ రెండో ఇన్నింగ్స్ 341/7 డిక్లేర్

లార్డ్స్, జూలై 12: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ చారిత్రక గెలుపును సొంతం చేసుకునేందుకు చేరువైంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబరిచిన భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యఛేదనలో ఇంగ్లీష్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. మూడోరోజు ఆటముగిసే స మయానికి 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

స్నేహ రాణా, క్రాంతి గౌడ్, సయాలీ రెండేసి వికెట్ల తో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టారు. భారత్ విజయం కోసం ఇంకా 4 వికెట్లు పడగొట్టాలి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 341/7 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. యస్తిక భాటియా సెంచరీతో కదంతొక్కింది. టెస్టుల్లో ఆమెకు ఇదే తొలి శతకం. అలాగే లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ యస్తికా చరిత్ర సృష్టించింది. యస్తికా భాటియా 113, స్మృతి మంధాన 70, రిఛా ఘోష్ 50 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ 5 వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌటయింది.