ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహాసభ
- బెంగళూరులో నిర్వహణ
- వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నేతలు
హైదరాబాద్, జూలై 12(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకతీతంగా ఐక్యం కావాలని, బీసీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహాసభ మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్‌రావులు వెల్లడించారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో కాస్మో పాలిటన్ క్లబ్‌లో ఆగస్టు 7న జరిగే జాతీయ ఓబీసీ మహాసభ విజయవంతం కోసం సమావేశం నిర్వహించారు.
అనంతరం జాతీయ ఓబీసీ మహాసభ వాల్ పోస్టర్ ను వివిధ రాష్ట్రాల ఓబీసీ నేతలతో కలిసి వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి 11వ జాతీయ ఓబీసీ మహాసభను బెంగళూరు పట్టణంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.బెంగళూరు ఓబీసీ నేత లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోల్కర్,
ప్రొఫెసర్ సంఘని మల్లేష్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, రామకోటేశ్వరరావు, రావులకోల్ నరేష్ ప్రజాపతి, మేక వెంకటేశ్వరరావు, నార బోయిన రవి ముదిరాజ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






