కాళేశ్వరంపై హరీశ్ అబద్ధా ల వరద
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాళేశ్వరంపై హరీశ్‌రావు అబద్ధాల వరద పారిస్తున్నాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఊర్లు కొట్టుకుపోయినా సరే రాజకీయాలే ముఖ్యం అన్నట్లు బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందన్నారు.
హరీష్‌రావు చదువుకున్నది పాలిటెక్నిక్ అయినా పెద్ద ఇంజనీర్‌లా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆదివారం ఆది శ్రీనివాస్ మీడి యాతో మాట్లాడారు. కాళేశ్వరం కూలేశ్వరం అయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు అసహనంలో ఉన్నారని విమర్శించారు. ప్రాజె క్టుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన సమాచా రం ఇస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాల వరద పారిస్తున్నారని అన్నారు. ఎల్లం పల్లి బరాజ్ తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.






