ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించాలి
కలెక్టర్ ఇలా త్రిపాటి
అర్మూర్, మే 13 (విజయ క్రాంతి) : కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశించారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లో మెప్మా, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. రోజువారి ధాన్యం సేకరణ, మిల్లులకు తరలిస్తున్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రక్ షీట్లు తెప్పించి ట్యాబ్ లో ఎంట్రీ చేస్తున్నారా.. హమాలీలు సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు.
వరి ధాన్యం సేకరణ తరలింపు రికార్డులను పరిశీలించారు. తూకం వేయడంలో ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మిల్లుల దగ్గర ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేయడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యన్ మాల్వియా, డి ఆర్ డి ఓ సాయన్న, డీఎస్‌ఓ శ్రీకాంత్ సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసీఓ శ్రీనివాస్, తహసిల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.






