15 April, 2026 | 10:04 PM

ఆకాంక్షిత లక్ష్యాలను పూర్తి చేయాలి

14-04-2026 01:35 AM

నీతి అయోగ్ ప్రత్యేక అధికారి రజత్ సైని ఆదేశం

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి):  ఆకాంక్షిత లక్ష్యాలను పూర్తిస్థా యిలో అమలు చేయాలని నీతి అయోగ్ ప్రత్యేక అధికారి రజత్ సైని అధికారులను ఆదేశించారు. నీతి ఆయోగ్ కార్యక్రమాల అమలు తీరును జిల్లా కలెక్టర్ హరితతో కలిసి సోమవా రం తిర్యాణి మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించారు.ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై  సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలో ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించి వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో గర్భిణుల ప్రసవాలు ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని డాక్టర్లు తెలియజేయడంతో, సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహిస్తున్న డాక్టర్ల బృందాన్ని ప్రత్యేక అధికారి అభినందించారు.

అనంతరం  నూతన అంగన్వాడీ భవనాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల హాజరు, పౌష్టికాహారం పంపిణీ, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసు కున్నారు. నీతి ఆయోగ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యతపై కలెక్టర్ హరిత ను అడిగి తెలుసుకుని పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

కలెక్టరే ట్‌లో నీతి ఆయోగ్ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  రజత్ సైని మాట్లాడుతూ తిర్యాణి బ్లాక్, జిల్లా బ్లాక్ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

అంగన్వాడీలలో పిల్లల పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టాల ని, బరువు తక్కువ ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగం గా జిల్లా కలెక్టర్ హరితతో కలిసి కేంద్ర ప్రబారి రజత్ సైని అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుబోధ్ కుమార్,జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీటీవో మల్లేష్, డాక్టర్లు కృష్ణ, అక్షయ్, పల్లవి, వివిధ శాఖల అధికారులు, సంపూర్ణత అభియాన్ జిల్లా సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.