18 June, 2026 | 3:17 AM

శాఖలు సమన్వయంతో పనిచేయాలి

18-06-2026 01:59 AM

ఎస్పీ జానకి 

మహబూబ్నగర్ క్రైం, జూన్ 17 : బాధితులకు మేలు చేసేందుకు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పి జానకి అన్నారు. బుధవారం జిల్లా భరోసా కేంద్రం కన్వర్జెన్సీ సమావేశం లో ఎస్పి జానకి మాట్లాడారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లోజిల్లా భరోసా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు ఇతర బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తో సమన్వయ సమావేశం నిర్వహించారు. 

సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల ద్వారా బాధితులకు అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం జిల్లా ఎస్పీ  డి.జానకి మాట్లాడుతూ భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడికి అవసరమైన న్యాయ, వైద్య, మానసిక, సామాజిక మరియు పునరావాస సేవలు ఒకే వేదికపై అందేలా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్, డీఎస్పీ రమణా రెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ, సీడబ్ల్యూ సీ ఛైర్మెన్ నయీముద్దీన్, జాన్, పోలీస్ ఇన్స్పెక్టర్ లు,  మెంబర్ గ్రేస్,  నర్మదా,  చైల్ లైన్ అధికారి,  భరోసా కేంద్రం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.