18 June, 2026 | 3:37 AM

శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సరికొత్త రికార్డు

18-06-2026 02:32 AM

దేశంలోనే తొలిసారిగా ‘పలస్డ్ ఫీల్ అబ్లేషన్’ చికిత్స 

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): కార్డియాక్ కేర్ విభాగంలో హైదరాబాద్‌లోని నిజాంపేట శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. గుండె లయ తప్ప డం (ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఏఎఫ్) సమస్యతో బాధపడుతున్న నలుగురు రోగులకు భారతదేశంలోనే మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ 3డీ మ్యాపింగ్ సిస్టమ్, ఇంట్రాకార్డియాక్ ఎఖోకార్డియోగ్రఫీ, అధునాతన ’పలస్డ్ ఫీల్ అబ్లేషన్’ (పీఎఫ్‌ఏ) సాంకేతికతలను కలిపి విజయవంతంగా చికిత్స అందించారు.

ఆసుపత్రికి చెంది న ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ వి. ఎస్. రాంచంద్ర, వారి వైద్య బృందం ఈ అరుదైన మైలురాయిని సాధించింది.  సాధారణంగా వేడి లేదా చల్లదనాన్ని ఉపయోగించే పాత పద్ధతులకు భిన్నంగా ఇందులో ’మైక్రోసెకండ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్’ ఉపయోగించి, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన భాగాలకు నష్టం లేకుం డా కేవలం సమస్య ఉన్న గుండె కణజాలాన్ని మాత్రమే ఖచ్చితత్వంతో వేరు చేశారు. ఇందు లో ’కార్టో సౌండ్’ టెక్నాలజీని వాడటం వల్ల ఎక్స్-రే రేడియేషన్ వాడకం దాదాపు శూన్యమని డాక్టర్ వి.ఎస్.రాంచంద్ర తెలిపారు. చికిత్స అనంతరం నలుగురు రోగులు పూర్తిగా కోలుకుని, అదే రోజే  డిశ్చార్జ్ అయ్యారు.