అభిమాని కోరిక తీర్చిన పవన్
- హనుమకొండలోని ఇంటికి వెళ్లి, పలకరింపు
- అరుదైన వ్యాధితో మంచానికే పరిమితం అయిన నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
- రూ.లక్ష ఆర్థిక సాయం, తిరుమల తీర్థప్రసాదాలు అందజేత
- వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు
హనుమకొండ, జూన్ 17 (విజయక్రాంతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డీఎన్‌డీ అనే జన్యుపరమైన వ్యాధితో బాధప డుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో పా టు తిరుమల తీర్థప్రసాదాలు అందజేశారు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు.
తన చివరి కోరికగా పవన్‌కళ్యాణ్‌ను కలవాలని అభిలాషిం చారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పవన్‌కళ్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. మంచం మీద పడుకుని ఉన్న నిరంజన్‌తో చాలా సమయం గడిపారు. లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు.
‘చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం’ అని నిరంజన్ చెప్పిన మాటలు విని కదిలిపోయారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షిం తలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ చేసిన డాన్సుల వీడియోలు, ఫొటోలను తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు.
తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు, అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని మనోధైర్యం నిం పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు.
కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్
నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్‌కళ్యాణ్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్ప గా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్‌ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరు గుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు సూచిం చారు. తర్వాత పవన్ కళ్యాణ్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యే క పూజ లు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్‌కె సాగర్ ఉన్నారు.






