కోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు
07-05-2026 12:25 AM
మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారానికి చెంపపెట్టులా సివిల్ కోర్టు తీర్పు అని మంత్రి సీతక్క విమర్శించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల అంశంపై బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పంది స్తూ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియా వేదికలపై ప్రచారం సాగిందని, సంబంధిత పోస్టులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది.
మంత్రి సీతక్క దాఖలు చేసి న పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా కోర్టు టెండర్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి బీఆర్‌ఎస్ ఆరోపణలకు ఎలాంటి ఆధా రాలు లేవని నిర్ధారించింది. ముఖ్యంగా రూ .30 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను కోర్టు పూర్తిగా ఖండించింది.






