05-02-2026 12:00:00 AM
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 4, (విజయక్రాంతి): నగరంలోని హౌసింగ్ బోర్డు కాల నీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ నూతన భవన నిర్మాణానికి బుధవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. హౌసింగ్ బోర్డు పరిధిలో 35 గుంటల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మిం చేందుకు శ్రీకారం చుట్టారు.
కరీంనగర్‌బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సీఏ రామిడి సంతోష్, సీఏ యర్ర తిరుపతయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమా నికి ఐసీఏఐ జాతీయ అధ్యక్షులు సీఏ చరణ్జోత్ సింగ్ నందా ముఖ్య అతిథిగా హాజర య్యారు.దక్షిణ ప్రాంతానికి చెందిన సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, సీఏ మధుకర్ నారాయణ హిరేగంగే, సీఏ రాజేంద్ర కుమార్ పి, సీఏ శ్రీప్రియా లు పాల్గొన్నారు.