calender_icon.png 7 February, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్రాళ్లు కుమ్మేశారు

07-02-2026 01:28:12 AM

  1. అండర్ 19 ప్రపంచకప్ మనదే

ఆరోసారి ట్రోఫీ కైవసం

ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

50 ఓవర్లలో భారత్ స్కోరు 411/9

అండర్ 19 క్రికెట్‌లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. ఏకంగా ఆరోసారి యువ భారత్ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. గత ఎడిషన్‌లో ఆసీస్ చేతిలో పరాజయంతో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈ సారి పట్టేసింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ అండర్ 19 జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత, కీలక బ్యాటర్ల మెరుపుల ఫలితంగా భారీస్కోరు చేయడంతోనే ట్రోఫీ ఖాయం చేసుకున్న భారత్‌కు ఇంగ్లాండ్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. 

హరారే, ఫిబ్రవరి 6 : టాస్ గెలిచి బ్యా టింగ్ ఎంచుకున్న భారత్ వీలైనంత భారీ టార్గెట్‌ను ప్రత్యర్థి ముందుంచడమే లక్ష్యంగా ఆడింది. సెమీఫైనల్ సెంచరీ హీరో ఆరోన్ జార్జ్ త్వరగానే ఔటైనప్పటకీ మరో ఓపెనర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ , కెప్టెన్ ఆయుష్ మాత్రే దుమ్మురేపారు. భారీ షాట్ల తో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ చెరొక ఎండ్ నుంచి రెచ్చిపోయారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి హద్దే లేకుండా పోయింది.

పలు మ్యాచ్‌లలో అర్థశతకాలు బాదిన ఈ చిచ్చర పిడుగు టైటిల్ పోరులో మాత్రం మరింతగా రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశా డు. కొడితే సిక్సర్ లేకుంటే బౌండరీ అన్న తరహాలో అతని విధ్వంసం సాగింది. 32 బంతుల్లో 50,  55 బంతుల్లో 100, 71 బంతుల్లో 150.. చివరికి 80 బంతుల్లో 175 పరుగులు.. అతని విధ్వంసకర బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బిత్తరపోయారు. బంతి ఎలా వేసినా బాదేస్తుంటే బౌలింగ్ చేసేందుకు కూడా భయపడినట్టు కనిపించింది.

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ చేసిన 175 పరుగుల్లో 150 రన్స్ బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. వైభవ్ దెబ్బకు పలు రికార్డులు బద్దలయ్యాయి. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ నిలిచాడు. 

అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక యూత్ వన్డేల్లో 110 సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 80 బంతుల్లో 175 పరుగులు చేసిన సూర్యవంశీ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. తర్వా త కెప్టెన్ ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీ చేయగా.. కుం దు, కనిష్క చౌహాన్ సైతం మె రుపులు మెరిపించారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరు గులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నా రు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది.

తొలి ఓవర్ నుంచే చేతులెత్తేసింది. కీలక బ్యాట ర్లందరూ నిరాశపరిచారు. డాకిన్స్ 66 , బెన్ మేయస్ 45 పరుగులు చేయగా.. ఫాల్కనీర్ సెంచరీతో పోరాడాడు. అయితే అతనికి సహచరుల నుంచి సరైన సపోర్ట్ లభించలేదు. ఫలితంగా సెంచరీ పూర్తి చేసుకున్నా జట్టును గెలిపించలేకపోయా డు. ఫాల్కనీర్ విధ్వంసం తోనే ఇంగ్లాండ్ స్కోరు 300 దాటగలిగింది.

చివరికి ఇం గ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. భార త బౌలర్లలో అం బరీష్ 3, దేవేంద్రన్ 2 , కనిష్క చౌహాన్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో 1998 తర్వాత అండర్ 19 ప్రపంచకప్ గెలవాలనుకున్న ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు. ఈ టోర్నీ ఆద్యంతం భారత్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. ఒక్క ఓటమి లేకుండా ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలి చి తిరుగులేని ఆధిపత్యంతో ట్రోఫీ కైవసం చేసుకుంది.