24 June, 2026 | 7:09 PM

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

24-06-2026 05:48 PM

 బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మనుమడు అరిగెల జుహీత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని చిరకుంట గ్రామంలో "ఏక్ పెడ్ మాకే నామ్" కార్యక్రమం నిర్వహించి 500కు పైగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా  మల్లికార్జున్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు గ్రామంలో మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి బతికేలా చర్యలు తీసుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి, ఉపసర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు ప్రసాద్ గౌడ్, సంతోష్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.