07-02-2026 01:20:13 AM
టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియా
సంచలనాలకు పసికూనలు రెడీ
తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో భారత్ ఢీ
ముంబై , ఫిబ్రవరి 6 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీ సీ టీ ట్వంటీ ప్రపంచకప్ శనివారం నుంచే మొదలుకానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. నెల రోజుల పాటు 55 మ్యాచ్‌లు అభిమానులను అలరించబోతున్నాయి. ప్రతీరోజూ మూడు మ్యాచ్‌లు జరగనుండగా.. సంచలనాలు సృష్టించేందు కు పసికూన జట్లు సిద్ధమయ్యాయి.
టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న టాప్ టీమ్స్ టోర్నీలో దుమ్మురేపేందుకు రెడీగా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను తేలిగ్గా తీసుకోలేం. అదే సమయం లో సంచలనాలకు చిరునామాగా మారిన ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద జట్లకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇది టీ ట్వంటీ ఫార్మాట్.
ఎవ్వరినీ ఫేవరెట్ గా చెప్పలేం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. అందుకే పెద్ద జట్లతో చిన్న జట్ల మ్యాచ్ లను కూడా లైట్ తీసుకోలేని పరిస్థితి కనినిపిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లను గ్రూపునకు ఐదు చొప్పున నాలు గు గ్రూపులుగా విభజించారు. తొలిరోజు శనివారం మూడు మ్యాచ్‌లు జరగనున్నా యి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా ఉ.11 గంటలకు జరిగే మ్యాచ్‌తో వరల్ కప్ షురూ అవుతుంది.
అలాగే మధ్యా హ్నం 3 గంటలకు వెస్టిండీస్, స్కాట్లాండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ రాత్రి 7 గంటలకు ముంబై వాం ఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏతో తలపడనుంది. ఈ సారి టోర్నీ భారత్, పాకిస్థాన్ మ ధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే బం గ్లాదేశ్‌కు మద్ధతుగా పాక్ క్రికెట్ బోర్డు భారత్ తో మ్యాచ్ బహిష్కరించింది.
ఫామ్, ట్రాక్ రికార్డ్ చూసు కున్నా టీడిండియా హాట్ ఫేవరేట్గా కనిపిస్తోంది. గత రెండేళ్లుగా టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్ 2026 చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఆతిథ్య జట్టు టైటిల్ గెలవలేదు. అంతేకాకుండా ఏ టీమ్ కూడా వరుసగా రెండో టైటిల్ అందుకోలేదు. ఈ చరిత్రను తిరగరాయాలనే పట్టుదలతో భారత్ ఉంది.
టీ ట్వంటీ ప్రపంచకప్ గ్రూపుల వివరాలు
గ్రూప్-ఎ : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా
గ్రూప్ బి : ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్
గ్రూప్-సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్
గ్రూప్-డి: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అఫ్గానిస్థాన్, కెనడా
తొలిరోజు మ్యాచ్‌లు
పాకిస్థాన్ X నెదర్లాండ్స్ - ఉదయం 11 గంటలకు ( వేదిక : కొలంబొ)
వెస్టిండీస్ X స్కాట్లాండ్ - మధ్యాహ్నం 3 గంటలకు ( వేదిక : కోల్ కత్తా)
భారత్ X యూఎస్‌ఏ - రాత్రి 7 గంటలకు ( వేదిక : ముంబై )