07-02-2026 02:09:36 AM
చివరి తేదీ మార్చి 16 పరీక్ష మే 13, 14 తేదీల్లో..
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవే శాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 16. మే 13, 14 తేదీల్లో రెండు సెషన్‌లలో ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 12.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది.