3 August, 2026 | 4:15 AM

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం

03-08-2026 12:32 AM

నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ఆగస్టు 2 : తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరంలోని శ్రీశ్రీశ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానికులు మహేందర్, ఈశ్వర్, మల్లేష్, హరికృష్ణ, ఎట్టయ్యా, జంగయ్య, యాదయ్య, కుమార్, పరమేశ్, నరేష్, శ్రీను, కావలి జంగయ్య, మహేష్, శివరామకృష్ణ, జాతర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.