3 August, 2026 | 2:57 AM

సారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

03-08-2026 12:32 AM

పాలకీడు, ఆగష్టు 2 : సారాను అక్రమం గా తరలిస్తున్న వ్యక్తినీ పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసిన ఘటన ఆదివారం   శూన్యపహాడ్ గ్రామంలో జరిగింది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన బాణావత్ మంచ్య  అను వ్యక్తి తన హీరో స్పెండర్ వాహనం పై సారాను తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. తదుపరి ఎక్సైజ్ అధికారి దివ్య వాహనంను సీజ్ చేసి 10 లీటర్ల సారా ను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టుకున్న వారిలో కానిస్టేబుల్ సుధాకర్, నాగరాజు , తదితరులు ఉన్నారు.