నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
03-08-2026 12:31 AM
ఎస్‌ఐ సీతపాండు
సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 2 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నారాయణపురం ఎస్త్స్ర సీతపాండు అన్నారు.ఆదివారం నారాయణపురం మండలకేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవశ్యకతను వ్యాపారస్తులకు ప్రజలకు వివరించారు.ప్రస్తుతం జరుగుతున్న నేరాలను వివిధ కేసులలో సీసీ కెమెరాల వలన జరిగిన లాభాన్ని వివరించారు.వర్తకులు తమ వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలను తప్పక మార్చుకోవాలని తెలిపారు.గతంలో జరిగిన అనేక నేరాలలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు వంగరి రఘు,కోశాధికారి సురక్షితం,తెలంగాణ బిక్షం,ఉప్పల వెంకటేష్,చిలివేరు శంకర్,ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






