మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ కుట్ర చేస్తోంది
ఎంపీ చామల కిరణ్‌కుమార్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఒక ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజె క్ట్ చేశారని విమర్శించారు. బుధవారం సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 230 ప్రకారం ఫామ్ 26 సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
బీజేపీ ఎన్నికలను వాళ్ల ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లకు అవకాశం ఉందని, కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. మూడో అభ్యర్థిని బీజేపీ ఎందుకు పోటీలో నిలబెడుతోందని ప్రశ్నించారు.
ముందు నుంచే మధ్యప్రదేశ్‌లో కాంగ్రె స్‌ను తప్పించాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయం గురించి దేశ ప్రజలకు తెలియాలన్నారు. బీజే పీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఎప్పటికీ అధికారంలోకి రారని కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు నిలబడే గొప్ప మహిళా నాయకురాలైన మీనాక్షి నటరాజన్‌ను తప్పుడు కారణాలతో అడ్డుకోవడం అత్యంత బాధాకరమని, ఈ అన్యాయం పై దేశ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. కోర్టు నోటీసు ఆధారంగా ఎటువంటి క్రిమినల్ ఎఫ్‌ఐఆర్ లేకపోయినా, సాంకేతిక కార ణాలను సాకుగా చూపి నామినేషన్‌ను రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా వీరేశం అభివర్ణించారు.
ఒక సాధారణ మహి ళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తట్టుకోలేక అడ్డుకోవడం, మహిళల పట్ల బీజేపీకున్న అసలు వైఖరిని, వారి వ్యతిరేక సంస్కృతిని బయటపెడుతోందని విమ ర్శించారు. అధికారానికి తలొగ్గే ఏక్‌నాథ్ షిండే లాంటి నాయకులను ప్రోత్సహిస్తూ, ఈసీ వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ దేశవ్యాప్తంగా వ్యవస్థలను బలహీనపరుస్తోందని మండిపడ్డారు. బీజేపీ వల్ల దేశ రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో హెచ్చరించిన విషయం నిజమేనన్నారు.






