27 July, 2026 | 3:36 AM

ఇసుక అక్రమ రవాణాకు అధికారుల అండ?

27-07-2026 02:38 AM

చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని ప్రజల మండిపాటు 

నిబంధనలు పాటిస్తే తక్కువ ధరలోనే ఇసుక రాదా?

పీఎస్‌లో ఫిర్యాదు చేసిన లారీ అసోసియేషన్ నేతలు

ఇసుక అక్రమ రవాణాకు అడ్డగా బాలనగర్ మండలం 

బాలా నగర్ జూలై 26: అక్రమ ఇసుక రవాణాకు హైదరాబాద్ కు అతి చేరువగా ఉన్న బాలనగర్ మండలం అడ్డగా మారింది. సాక్షాత్తు లారీ అసోసియేషన్ నేతలే పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్రమ ఇసుకను అడ్డుకట్ట వేయాలని ఫిర్యాదు చేశారంటే ఎంత దర్జాగా ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ప్రజలు చర్చించుకుండ్రు.

అప్పుడు.. ఎప్పుడో ఒకమారు ఇసుక లారీలను ఆపి కేసు నమోదు చేసి నిరంతరం విధుల్లో ఉంటున్నామని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన మేరకు అడ్డుకట్ట పడడం లేదని లారీ అసోసియేషన్ నేతలు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. 

ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా!

లారీ అసోసియేషన్ నేతులే నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఫిర్యాదు చేస్తేనే స్పందించడం ఏంటని పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతంలోని ఇసుక తరలింపుకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. తక్కువ సమయంలోనే నగరాన్ని చేరుకునేందుకు అవకాశం ఉండడంతో అత్యధిక జరగకుండా ఈ ప్రాంతంలో ఉత్పన్నమయ్య ఇసుక పలకనుంది.

అసలే ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే అని ప్రభుత్వం ఇప్పటికే చెప్పడంతో పాటు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచనలు చేస్తుండడంతో అక్రమ ఇసుక యదేచ్చంగా జరిగితే  భూగర్భ జలాలు మరింత అట్టడుగు స్థాయికి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొని అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మేము నిబంధనలు పాటిస్తున్నాం..

ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ పన్నులు చెల్లిస్తూ ఇసుకను తరలించడం జరుగుతుందని లారీ అసోసియేతలు పేర్కొంటున్నారు. అక్రమంగా ఇసుక తరలింపు చేయడం ద్వారా తమకు ఆశించిన మేరకు ఇసుక ఆర్డర్లు రావడం లేదని దీంతోపాటు తక్కువ ధరకు ఇసుక అడుగుతున్నారని అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు తాము చేసే పనులు భారతరత్కంగా ఉంటుందని లారీ అసోసియేషన్ నేతలు పేర్కొంటున్నారు. అక్రమ ఇసుక ను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని వారు చెబుతున్నారు.