11 June, 2026 | 2:12 AM

నిరంకుశత్వానికి అద్దంలా బీజేపీ తీరు

11-06-2026 01:04 AM

కాంగ్రెస్ నాయకుల మండిపాటు

వరంగల్, జూన్ 10 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్ నుంచి దాఖలు చేసిన తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచం మైదాన్ సెంటర్‌లో వరంగల్ పోచమ్మ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో దహనం చేశారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఏఐసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఎన్నికల అధికారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే కనీసం సమాధానం చెప్పకపోగా తెలంగాణలో క్రిమినల్ కేసు ఉన్నదని చెప్పి తిరస్కరించార పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బసవరాజు శిరీష శ్రీమాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ రమేష్, జన్ను రవి,కరాటే ప్రభాకర్,ఆరెల్లి రవి, యువజన కాంగ్రెస్ నాయకుడు కొరివి పరమేష్ సలీం పాషా, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్లు దామెర జన్ను రవి జన్ను అరుణ్ తదితరులు పాల్గొన్నారు.