డ్రగ్స్ కట్టడిలో ప్రజల భాగస్వామ్యం అవసరం
మావోయిస్టుల సమస్య సమసిపోయింది
ఇతర విభాగాలకు గ్రేహౌండ్స్ ఫోర్స్ డీజీపీ సీవీ ఆనంద్
ఆదిలాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోయారని, ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు సమస్య లేదని, ఉన్న ఒకరిద్దరు సైతం లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ సమస్య పెరుగుతోందని, దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
డ్రగ్స్‌పై పోరాటం చేయకపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుం దనీ, డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వ హించిన వివిధ కార్యక్రమాల అనంతరం గుదిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో డీపీజీ పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన డీజీపీకి ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గ్రామ పెద్దలు గుస్సాడీలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం కుమ్రం భీం విగ్రహానికి డీజీపీ పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆదివాసీ పెద్దలు అతిథులకు తమ సాంప్రదాయ తలపాగలు, నెమలి పింఛం (గుస్సాడీ) టోపీలు ధరించా రు. సందర్భంగా గ్రామ యువకులకు క్రికెట్ కిట్లు, పలువురికి హెల్మెట్లను పంపిణీ చేశా రు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను అందజేశారు.
అనంతరం జిల్లా పోలీస్ హెడ్ క్వార్ట ర్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ... భూపాలపల్లి, ఏటూర్ నాగారం, భద్రాచలం, ఆదిలాబాద్ లో లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారని వారికి భూమితో పాటు ఇతర అవస రాలు తీరుస్తామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినందున గ్రేహౌం డ్స్ లోని కొంత ఫోర్స్‌ను ఇతర విభాగాలకు తరలిస్తామని తెలిపారు. ఆ విభాగాన్ని పూర్తి గా తీసేయడం లేదని, గ్రేహౌండ్స్‌లో 500 మంది సిబ్బందిని వేరే విభాగాలకు మార్చమన్నారు. కాగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై వ్యాఖ్యా నిస్తూ ప్రజలను గౌరవిస్తాం... కానీ రౌడీలు, గుండాలను కాదు అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు 30 ఏళ్ల తర్వాత రావడం సంతోషంగా ఉందని, ఉమ్మడి జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పని చేసానని గుర్తు చేశారు.
రాష్ట్రంలో గత ఏడాదిలో 7,800 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని అన్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ లు, నిబంధనలను పాటించని డ్రైవింగ్ ల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసింగ్ వ్యవస్థ బాగుందనీ, నేరస్తులు, రౌడీలు పోలీసులకు భయ పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మ ల్టీజోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. మౌనిక, ఉట్నూ ర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






