27 July, 2026 | 3:37 AM

చుక్కనీరు లేకుంటే ఎట్లా..?

27-07-2026 02:45 AM

ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటుంది?

ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రైతు బాగుపడతడా?

మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి

కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై గూగల్ ప్రాంతంలోని బ్రిడ్జిని పరిశీలించిన బీఆర్‌ఎస్ నేతలు

మహబూబ్ నగర్ జూలై 26 (విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రంలోని గూడూరు గ్రామం వద్ద భీమా నదిపై నిర్మించిన రివర్ బ్రిడ్జిను, కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై గూగల్ ప్రాంతంలోని బ్రిడ్జిని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

ఈ  సందర్భంగా వారు మాట్లాడారు. కర్ణాటక వైపు ఉన్న ప్రాజెక్ట్ ల్లో నీళ్లు ఉంటే తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్ట్ ల్లో చుక్కనీరు లేదని, కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతంగానికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.మహబూబ్ నగర్ ను ఎడారి చేసేందుకు పక్క రాష్ట్రలు ప్రయత్నం చేస్తున్నాయని, తుంగభద్ర నీరు రాకుండా ఆర్డిఎస్ వద్ద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్ట్ లు నిర్మాణం చేస్తున్నారు. శ్రీశైలంకు నీరు రాకుండా చేస్తున్నారని విమర్శలు చేశారు.

పాలమూరు ప్రాజెక్ట్ 10 శాతం పనులు చేస్తే రిసర్వాయర్లు నింపుకునేందుకు అవకాశం ఉండే. 10 లక్షల ఎకరాలకు సాగు నీరు వచ్చేది. ప్రాజెక్ట్ వెంటనే పూర్తి చేయాలన్నారు.  గుండ్రేవుల నుంచి నీరు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. కర్ణాటక కూడా అక్రమ ప్రాజెక్ట్.. బ్యారేజిలు.. చెక్ డ్యామ్ లు కడుతున్నారని, పై నుంచి నీరు రాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కృష్ణ.. భీమా నదులపై అక్రమ ప్రాజెక్ట్లు.. బ్యారేజిల.. చెక్ డ్యామ్ లు కడుతున్నారని, ఆల్మట్టి డ్యామ్ 300 టీఎంసీ పెంచెందుకు పనులు జరుగుతున్నాయి.. ఇప్పటికే భూసేకరణ ప్రారంభించారన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో మంచి చేయాలని సంకల్పంతో ముందుకు సాగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.