సింగరేణిపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు
20-06-2026 12:34 AM
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): సింగరేణి విషయంలో బీజేపీ నాయకులు చిల్లర మాటలు మానుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. సింగరేణిలో పర్యటించే హక్కు బీజేపీకి లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు.






