20 June, 2026 | 2:16 AM

విద్యా ప్రక్షాళన.. నా లక్ష్యం

20-06-2026 01:00 AM
  1. అందుకే విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్న
  2. విధ్వంసం నుంచి వికాసం వైపు 
  3. విద్యకే 8.5% నిధులు 
  4. తలరాతను మార్చేది చదువే.. మీకేం కావాలో నాకు చెప్పండి
  5. విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి  
  6. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్‌లు పంపిణీ   

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : ‘గత పాలకుల విధ్వంసంతో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది.. సమూలంగా ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం నా లక్ష్యం. అందుకే విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భాషా ప్రయుక్త రాష్ట్రంగానో, పాలనా సౌలభ్యం కోసమో ఏర్పడి న రాష్ట్రం కాదని, అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిం దన్నారు.   

తెలంగాణ భవిష్యత్ తరగతి గ దుల్లోనే ఉందని విశ్వసించామని, అందుకే విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించాలచే లక్ష్యంతో ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యరంగానికి 8.5 శాతం నిధులు కేటాయించామని, రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇది ఖర్చుగా కాదు.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తామని వెల్లడించారు.

శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడి యంలో విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్‌లను గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ చేశారు. రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు.  ‘అన్న- అక్క మెటార్షిప్’ కార్యక్రమాన్ని గవర్నర్‌తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, డైట్, కాస్మోటిక్ చార్జీలు కూడా పెంచలేదన్నారు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను విధ్వం సం చేసిన వాళ్లు.. విద్యాశా ఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడ టం విడ్డూరంగా ఉందన్నారు.  

ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్  

ప్రీప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పున రుద్ధరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని, ఎవ్వరూ కల లో కూడా ఊహించి ఉండరని, ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్  ఏర్పాటుతో అ సాధ్యాన్ని సుసాధ్యం చేసి చూ పించామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నామన్నారు.

ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇం డియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కోట్లాది మంది నిరుద్యోగు లుగా మిగిలిపోతున్నారని, అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించామని పేర్కొన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మా ర్చామని, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, రా జకీయ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో భా గస్వాములు కావాలని, దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మీరు చదవండి, మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్య త మీ రేవంతన్న తీసుకుంటారని హామీ ఇచ్చారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సువర్ణాధ్యాయం: డిప్యూటీ సీఎం భట్టి  

పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభు త్వం చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన వస్తువులతో కూడిన విద్యాకిట్లను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు, విద్యార్థుల ఆత్మగౌర వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

27 లక్షల మంది విద్యార్థులకు ఒక తండ్రిలా బాధ్యత తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ కిట్లను అందిస్తున్నారని పేర్కొన్నారు. వి ద్యార్థులకు చదువుతో పాటు ఆహార్యం, మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయి లో ఉండాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందులో భాగంగానే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేసిందన్నారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు.  ఆరుట్ల గ్రా మంలో  ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇందుకు నిదర్శనమన్నారు. 

శంకుస్థాపనల వివరాలు

* రూ.10 కోట్లతో షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో మినీ స్టేడియం నిర్మాణం 

* రూ.10 కోట్లతో సంగారెడ్డిలోని   అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ 

* రూ.4 కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వలో మినీ స్టేడియం 

* రూ.4 కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్ట్స్ నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి

* రూ.3.50 కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం 

* రూ.2.65 కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మినీ స్టేడియం 

* రూ.2.50 కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్  కబడ్డీ కోర్ట్స్  

ప్రారంభోత్సవాలు

* గచ్చిబౌలి స్టేడయంలో రూ.5.70 కోట్లతో బాలికల కోసం ఫిఫా ఏఐఎఫ్‌ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ  

* గచ్చిబౌలి స్టేడియంలో బాలుర కోసం  తెలంగాణ టాలెంట్ అకాడమీ 

* గచ్చిబౌలి స్టేడయంలో బాలికల కోసం రూ.35.95 లక్షలతో అథ్లెటిక్స్ అకాడమీ  

* గచ్చిబౌలి స్టేడయంలో రూ.35.94 లక్షలతో బాలుర కోసం అథ్లెటిక్స్ అకాడమీ 

* రూ.44.50 లక్షలతో గచ్చిబౌలి స్టేడయంలో బాలికల హాకీ అకాడమీ 

* రూ.44.50 లక్షల తో గచ్చిబౌలి స్టేడయంలోబాలుర హాకీ అకాడమీ 

* రూ.58.50 లక్షలతో ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాలుర ఫుట్ బాల్ అకాడమీ, ఎల్‌బీ స్టేడియంలో బాలురకు హ్యాండ్ బాల్ అకాడమీ..