20 June, 2026 | 2:14 AM

గేమ్ ఛేంజర్లు.. బుల్లెట్ రైలు కారిడార్లు

20-06-2026 12:55 AM
  1. రూ.10 లక్షల కోట్లతో 3 హైస్పీడ్ కారిడార్లు
  2.    100 కోట్లతో కనెక్టివిటీ రోడ్లు
  3. హైదరాబాద్ చుట్టూ 25 వేల కోట్లతో మరో రింగ్ రోడ్డు
  4. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  5. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో రోడ్డు పనులకు శంకుస్థాపనలు
  6. హాజరైన మంత్రి కోమటిరెడ్డి

మహేశ్వరం/ఇబ్రహీంపట్నం, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యం గా రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయం తో కట్టుబడి ఉన్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాయని ప్రకటించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు పట్టణీకరణ దిశ గా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వీటికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని చె ప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఫ్) కింద సుమారు రూ.87 కోట్ల విలువైన రోడ్డు పనులకు శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు పట్టణీకరణ దిశగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వీటికి మె రుగైన రహదారి అనుసంధానం కల్పించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని చెప్పా రు. దేశవ్యాప్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో భాగంగా హైదరాబాద్-పూణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాల్లో మూడు హైస్పీడ్ కారిడార్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

భూసేకరణ వ్యయాలతో కలిపి దీని అంచనా వ్యయం రూ.10 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని, ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. తిమ్మాపూర్, కొం గర, రావిరాల, శ్రీశైలం రోడ్డు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలను కలుపుతూ రూ.100 కోట్ల కేంద్ర నిధులతో రహదారులను నిర్మిస్తున్నామని, మాదాపూర్, బేగంపేట్ వైపు కూడా కనెక్టివిటీ పెంచుతున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ రూ.20 వేల నుంచి రూ.25 వేల కోట్ల వ్యయంతో మరో రింగ్ రోడ్డుకు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

నిలిచిన పనులన్నీ త్వరలోనే పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర రోడ్లు, -భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి రోడ్ల అనుసంధానమే అత్యంత కీలక మని అభిప్రాయపడ్డారు. గతంలో కాం ట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందకపోవడం వల్లే కొన్ని రోడ్డు పనులు ఆలస్య మైన మాట వాస్తవమేనని అంగీకరించా రు. ఆ పరిస్థితులు పునరావృతం కాకుం డా చర్యలు తీసుకుంటా మని హామీ ఇ చ్చారు.

కొంగర, రావిరాల, తిమ్మాపూర్, రాచులూరు, ఆగర్మియగూడెం ప్రాంతాల రహదారి పనులన్నింటినీ తక్షణమే సమీక్షించి, రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభు త్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఆర్ అండ్ బి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి,  ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.