గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పరకాల (మహబూబాబాద్) జూన్ 19 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని,గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నడికూడ మండలంలోని పలు గ్రామాలలో ఈ జి ఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు,
మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాలలోని ప్రతి వార్డులోను ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు. పార్టీలకతీతంగా సీఎం ఆర్‌ఎఫ్, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మండ్లను పేదలకు పంపిణీ చేస్తున్నమన్నారు.






