ఆర్టీసీపై పీటముడి!
- ఆర్టీసీ కార్మికుల విలీనం.. కార్మికుల సంఘానికి ఎన్నికలపై కుదరని ఏకాభిప్రాయం
- సీఎం, పొన్నం.. మధ్యలో ఆర్టీసీ!
- ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి పొన్నం తాజా ఆదేశాలు
- సీఎం ఆప్షన్లు తీసుకున్న నేపథ్యంలో నేరుగా విలీనమే చేయాలంటున్న కార్మిక సంఘాలు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఆర్టీసీపై ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు నలిగిపోతు న్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ.. మరోవైపు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట లు ఆర్టీసీని సందిగ్ధంలోకి నెట్టివేశాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీ నం చేయాలా.. అంతకుముందుగా కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాలా అనేదానిపై ప్రభుత్వ పెద్దల్లోనే ఏకాభిప్రాయం రాకపోవడం తమ ను ఎక్కడ ఇబ్బందుల పాలు చేస్తుందోన నే ఆందోళనలో కార్మికులు ఉన్నారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రారంభించిన సమయంలో మంత్రుల కమిటీ వేసి, ఇచ్చిన హామీకి.. అటు తరువాత సీఎం తమ నుంచి ఆప్షన్ తీసుకున్న దానికి మధ్యన పొంతన లేకపోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ కార్మిక వర్గాలు వాపోతున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో, ఈ అంశం మరోసారి కార్మి క వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ సమ్మె విరమణ చర్చల్లో పాల్గొన్న మంత్రుల కమిటీతో భేటి సందర్భంగా.. కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తామని, గుర్తింపు సంఘం ప్రతినిధులకు అధికారుల కమిటీలో చోటు కల్పిం చి.. నిర్దిష్టమైన సమయంలోగా విలీనం ప్రక్రియను పూర్తిచేస్తామంటూ.. మంత్రుల కమి టీ 24.4.2026 నాడు కార్మిక సంఘాలకు హామీ ఇచ్చింది. దీనితో సమ్మెను కార్మిక సం ఘాలు విరమించాయి. దీనితో త్వరలోనే కా ర్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తారని కార్మికులు భావించారు.
అయితే అనుకోకుండా.. మేడే (మే ఒకటి నాడు) సీఎంతో ఆ ర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధుల భేటి సందర్భంగా.. అకస్మాత్తుగా విలీనమా.. కార్మిక సం ఘం ఎన్నికలా.. ఏదో ఒకటి తేల్చుకోండంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా ఆప్షన్ అడిగారు. దీనితో అప్పటికప్పుడు కార్మిక సంఘాలు రాతపూర్వకంగా తమకు విలీనమే ముఖ్యమని, విలీనం పూర్తి చేయాలం టూ సీఎంకు ఆప్షన్ ఇచ్చారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి అప్షన్ అడగడంతో.. కార్మి క సంఘాల ఎన్నికలతో ఎలాంటి సంబం ధం లేకుండానే విలీనం ప్రక్రియను పూర్తిచేస్తారని అప్పట్లో కార్మిక సంఘాలు సంతో షాన్ని వ్యక్తంచేశాయి.
ఆలస్యం.. డోలాయమానం..
అయితే దాదాపు రెండు నెలల కాలం దగ్గరికి వస్తున్నా.. అటు ఎన్నికలపై, ఇటు విలీనంపై ఎలాంటి అడుగు వేయకపోవడంతో.. కార్మికుల్లో సర్వత్రా అసంతృప్తి వ్యక్త మవుతోంది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా అప్ప టి పరిస్థితులకు అనుగుణంగా.. ఎన్నికలు నిర్వహించి.. అధికారుల కమిటీలో ప్రతినిధులను చేర్చి.. నిర్దిష్ట కాలంలోగా విలీనం చేస్తా మంటూ మంత్రుల నుంచి వచ్చిన హామీకి తలొగ్గామని కార్మికులు అంటున్నారు.
అయితే మేడే సందర్భంగా సీఎం ఏది కావా లో తేల్చుకోవాలనే ఆప్షన్ ఇవ్వడంతో, అం తిమంగా తమకు విలీనమే ముఖ్యం కనుక.. అదే ఆప్షన్ ఇచ్చామని వారు చెబుతున్నారు. అయితే మంత్రుల కమిటీలో సభ్యు డు, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం.. వివిధ సందర్భాల్లో ఎన్నికలు నిర్వహిస్తామంటూనే ప్రకటిస్తున్నారు. కానీ సీఎం తీసుకున్న ఆప్షన్ విషయంలో ఒక్కమాటకూడా మాట్లాడటం లేదు.
అలాంట ప్పుడు సీఎం ఎందుకు ఆప్షన్ తీసుకున్నారనే ప్రశ్నను కార్మికులు సంధిస్తున్నారు. అదే సందర్భంలో.. సాక్షాత్తు సీఎం సూచనమేరకు విలీనం ఆప్షన్‌ను ఎంచుకున్నందున.. నేరుగా విలీనమే ఉంటుందని తాము భా వించామని కార్మికులు అంటున్నారు. కానీ.. ఈ రెండు హామీలకు సంబంధించి.. రెండు నెలలపాటు ఒక్క అడుగుకూడా పడకపోవడంతో ఆర్టీసీ అంశంపై రెండు భిన్నమైన ఆలోచనలు ఇంకా కొలిక్కి రాలేదనే సంకేతాలకు చిహ్నమని కార్మికులు అంటున్నారు.
తకరారు..
సాక్షాత్తు సీఎం ఆప్షన్ అడగడంతో.. తమ సమస్యకు పరిష్కారం లభించినట్టేనని అప్పట్లో అందరూ భావించారు. అయితే గు రువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభా కర్ ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో కార్మికులు మరోసారి హతాశులయ్యారు. అంతి మంగా విలీనమే కావాలని తాము స్పష్టం చేసినప్పటికీ.. సాక్షాత్తు సీఎం తమ నుంచి ఆప్షన్ తీసుకున్నప్పటికీ.. అందుకు భిన్నంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కార్మిక సంఘం ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో.. కార్మికులు గందరగోళానికి గురవుతున్నారు.
అసలు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేక భిన్న ఆ లోచనలు.. భిన్న హామీలతో కాలయాపన చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో పరిస్థితులకు అనుగుణంగా అటు మంత్రుల కమిటీ.. ఇ టు సీఎం భిన్నంగా హామీలు ఇచ్చినప్పటికీ.. అంతిమంగా ఒకే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సీఎం హామీకి, రవాణా శాఖా మంత్రి ప్రకటనకు బేధం కనపడుతోందని, అంటే.. ఆర్టీసీపై ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల మధ్య సయోధ్య కుదిరినట్టుగా కనపడటం లేదని కార్మికులు చర్చించుకుంటున్నారు.






