28 May, 2026 | 2:51 AM

లక్ష్మీనరసింహుడికి లక్ష పుష్పార్చన

28-05-2026 01:55 AM
  1. ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు                                   
  2. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ సతీమణి

యాదగిరిగుట్ట, మే 27 (విజయక్రాంతి): ఏకశిఖర వాసుడు శ్రీలక్ష్మీనృసింహుడి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం సంద ర్భంగా లక్షపుష్పార్చన శాస్త్రోక్తంగా జరిగింది. విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాల య ముఖమండపంలో ఉత్సవమూర్తుల ను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అ లంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై తీర్చిది ద్దారు.

అర్చక బృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా ని ర్వహించారు. కాగా గవర్నర్ సతీమణి జానకిశుక్ల, కుమార్తె నీతి శుక్ల కుటుంబ సమేతం గా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని, అనుబంధ ఆలయం పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా రు. వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ స్వా గతం పలికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.