28 May, 2026 | 2:55 AM

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు భరోసా

28-05-2026 12:00 AM

బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

నాగోల్, మే 27 (విజయ క్రాంతి): నాగోల్ డివిజన్ జైపూరి కాలనీకి చెందిన రుక్మిభాయ్ వెన్నుపూస సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతుండగా, కుటుంబ ఆర్థిక పరిస్థితి చికిత్సకు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో బాధితురాలి చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరై, బాధిత కుటుంబ సభ్యుడు రోహిత్కు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

ప్రజా సేవే నా లక్ష్యం. గత 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మంది నిరుపేదలకు సహాయం చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి తక్షణ సహాయం అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఆయన చొరవ వల్లే తమ తల్లికి మెరుగైన వైద్యం అందే అవకాశం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మహిళా నాయకురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.