23 July, 2026 | 1:53 AM

కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టు హేయమైన చర్య

23-07-2026 12:54 AM

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ 

ముషీరాబాద్, జూలై 22(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల అక్రమ అరెస్టు హేయమైన చర్య అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్ విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ అగ్రనేతలు అరెస్టును నిరసిస్తూ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు బుధవారం ముషీరాబాద్ నుంచి ఛలో లోక్ బావన్ కు ర్యాలీగా తరలివెళ్లారు.

ముఖ్యఅతిథిగా హాజరైన అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ  విద్యార్థుల సమస్యలు, దేశప్రజలు ఓదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో విఫలం చెందారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్, బాపూజీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల శ్రీకాంత్ గౌడ్, నరేం దర్బాబు, నగర కార్యదర్శి రశీద్ పాల్గొన్నారు.

ప్లకార్డులతో నిరసన..

కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు ఛలో లోక భవన్ కార్యక్రమానికి ముషీరాబాద్ డివిజన్ నుంచి  పెద్ద ఎత్తున కాంగ్రెపార్టీ నా యకులు తరలివెళ్లారు. నియోజకవర్గం కాం గ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షుడు పట్నం నాగభూష ణం గౌడ్, బి బ్లాక్ కమిటీ కార్యదర్శి రామకృష్ణ ముదిరాజ్,  పార్టీ సీనియర్ నాయకు లు తదితరులు ర్యాలీగా తరలివెళ్లారు.