మంత్రి పొంగులేటికి సన్మానం
23-07-2026 12:52 AM
బడంగ్ పేట్ , జులై 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గాంధీ భవన్ లో కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యదర్శి ఏల్మేటి అమరేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డికి మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై వారితో కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






