22 May, 2026 | 9:29 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

ఆరోపణలు అవాస్తవం

30-10-2025 05:35 PM

వీడియో ద్వారా స్పష్టం చేసిన ఎంపీడీవో

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ఈజిఎస్ టిఏ దుగుట భార్గవ్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్ గురువారం వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ నెల 28న జ్వరం, జాండీస్, తల సేమియా వ్యాధితో బాధపడుతూ భార్గవ్ మరణించాడు అని తెలిపారు. తాను టీఏ భార్గవ్ అంత్యక్రియలకు వెళ్లే క్రమంలో తనపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, దీంతో తాను అంత్యక్రియలకు వెళ్లకుండా వెన్నుతిరిగినట్లు తెలిపారు.

బెల్లంపల్లి మండలానికి చెందిన మాజీ ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, మాజీ టిఏ గోమాస శ్రీకాంత్, ఈజీఎస్ ఈసీ అనిల్ కుమార్, ఈజీఎస్ ఏపీవో ఎస్టర్ డేవిడ్, జునుగురు సతీష్ అనే వ్యక్తులు తాను మామూళ్ల కోసం వేధిస్తున్నట్లు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని స్పష్టం చేశారు. ఈజీఎస్ పనులకు సంబంధించి 145 సైన్ బోర్డులు పెట్టకుండా రూ. 5.80 లక్షలు స్వాహా చేయడంతో ఈజీఎస్ సిబ్బందికి తాను మెమో ఇచ్చి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. టిఏ భార్గవ్ మరణాన్ని రాజకీయంగా వాడుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీడియో ద్వారా ఎంపీడీవో మహేందర్ స్పష్టం చేశారు.