22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

గ్రామాల్లో మండల అధికారుల సమీక్ష

30-10-2025 05:37 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సదర్ మాట్ ఆనకట్ట సందర్శన, పాఠశాల తనిఖీ..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలను గురువారం మండల అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మొంథా తుఫాను ప్రభావం పరిస్థితిలను అంచనా వేయడానికి మండలంలోని మేడిపల్లి గ్రామపంచాయతీలో ఉన్న సదర్ మార్ట్ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం సుర్జాపూర్, మేడమ్ పల్లి, బాదన కుర్తి, చింతలపేట, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇల్లు పరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని మేస్త్రీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ తాసిల్దార్ సుజాతా రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీ ఓ రత్నాకర్ రావు, ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పలువురు ఉన్నారు.