15 June, 2026 | 10:02 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శ్రీనివాస్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలి

23-02-2026 12:54 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పై ఆర్య వైశ్యుడు అయినా మాజీ బిజెపి ఫ్లో లీడర్ 39వ వార్డ్  కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చేసిన ఆరోపణలకు రుజువులతో సిద్ధంగా ఉండాలని కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు సవాల్ విసిరారు.

ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేసిన అవినీతి పై ఆరోపాలు చేస్తూ ఘాటుగా విమ ర్శించారు. వైశ్య సంఘo విలువలు దిగజార్చే విధంగా మాట్లాడడం సభ్యత సంస్కారం మరిచి మాట్లాడిన మోటూరి శ్రీకాంత్ చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి తడి బట్టలతో రావాలని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులను షబ్బీర్ అలీ బనియా మక్య లవడాలు అని తిట్టినట్లు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను రుజువు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మచ్చలేని మా నాయకుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు చేయడం నీకు తగునా అని వారు ప్రశ్నించారు. కౌన్సిలర్ గా కొనసాగినన్ని రోజులు నీవు చేసిన అవినీతి చిత్త తమ వద్ద ఆధారాలతో ఉందని నీవు పెట్టుకున్న వాచ్ కూడా అక్రమంగా నిర్మించినఒక బిల్డర్ ఇచ్చిన గిఫ్ట్ కాదా అని వారు ప్రశ్నించారు. ప్లాట్లు తగాదాలు సెటిల్మెంట్స్ చేసి సంపాదించిన అక్రమ సంపాదన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని మా నాయ కుడు కైలాస్ శ్రీనివాసరావు పై చేసిన ఆరోపణలకు రుజువుల తో అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రుజువు చేయాలని తేదీ సమయం ఎప్పుడు తెలియజేస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య ప్రతినిధులు లక్ష్మిరాజ్యం, ముప్పారపు ఆనంద్, గంప ప్రసాద్, పెన్సిల్ వారి శ్రీకాంత్, కైలాస్ లక్ష్మణ రావు, నరహరి, కొత్త బీమారాజ్, రమేష్, శ్రీనివాస్, పార్శి గంగరాజు, చందు పాల్గొన్నారు.