‘అల్లాపూర్’ స్థలాన్ని తెలుగు, ఉర్దూ మీడియంకు కేటాయించాలి
ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్‌పల్లి, జులై 2౮ ( విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గం లోని అల్లాపూర్ డివిజన్ సర్వేనెంబర్ 18 లోని స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలుగు ఉర్దూ మీడియం పాఠశాలల తో పాటు కమ్యూనిటీ హాల్, బస్తి దావఖాన ను నిర్మించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఆ స్థ లానికి ప్రహరీ నిర్మించినందుకు కలెక్టర్ మ ను చౌదరికి ధన్యవాధాలు తెలిపారు.
త్వరలోనే ఆ ప్రాంతంలో నిర్మాణాలను చేప ట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం కూకట్పల్లి ని యోజకవర్గంలో కైతలాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానికులకే కేటాయించేలా చూడాలని, ఎక్కడెక్కడ నుంచో వచ్చి మంత్రులు, ప్రభుత్వాధికారుల అనుచరులకు ఇళ్లను కేటాయించడం సరైన పద్ధతి కాదని కలెక్టర్ కు తెలిపారు. ఈ విధంగా ఇళ్ల ను కేటాయించినట్లయితే కూకట్పల్లి నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కు వివరించారు.
రికమండేషన్ పై ఎవరికైతే కేటాయించారో వా టిని వెనక్కి తీసుకొని పారదర్శకంగా నిరు పేదలకు కేటాయించేలా చూడాలని, వాటిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, సబిహా గౌసుద్దీన్,బి ఆర్ ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, వీరారెడ్డి, సత్యం, చాంద్, సంజీవరెడ్డి, రాము, శ్యాంసుందర్ రెడ్డి,జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






