29 July, 2026 | 2:48 AM

జిల్లా ఉత్తమ రైతుగా జగదీశ్వర్‌రెడ్డి

29-07-2026 12:02 AM

పెబ్బేరు, జూలై 28: రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన రైతు పి. జగదీశ్వర్ రెడ్డికి ‘ఉత్తమ జిల్లా రైతు‘ పురస్కారం అందజేశారు. రైతు నేస్తం కార్యక్రమానికి అత్యధిక సార్లు హాజరై, ఆధునిక సాగు పద్ధతులపై ఆసక్తి చూపుతూ వ్యవసాయంలో చురుకైన భాగస్వామ్యం కనబరిచినందుకు ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఆయనను అభినందిస్తూ, ఆయన సేవలు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.