13 June, 2026 | 4:11 AM

నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలి

13-06-2026 12:00 AM
  1. ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారికి న్యాయం చేయాలి
  2. వీహెచ్‌పీ రాష్ట్ర ప్రముఖ్ బాలస్వామి

హైదరాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలిక పై జరిగిన అత్యాచారం, హత్యాయత్న ఘటన అత్యంత దారుణమని విశ్వహిం దూ పరిషత్ ధర్మాచార్య సంపర్క విభాగ్ రాష్ట్ర ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు మహ మ్మద్ గౌస్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకుండా కఠిన నిర్ణయాలు తీసు కోవాల్సిన అవసరం ఉం దని బాలస్వామి పేర్కొ న్నారు.

నేరాలను ఖండిం చే విషయంలో కులం, మతం, రాజకీయ అను బంధాలు ప్రామా ణికం గా మారకూడద న్నారు. సమాజంలో మే ధావులు గా, సామాజిక కార్యకర్త లుగా, సోషల్ మీడియా ప్రముఖు లుగా చలామణి అవుతున్న వ్యక్తులు కూడా ప్రతి ఘటనను ఒకే ప్రమాణంతో చూడా లని, బాధితులకు న్యాయం జరిగేలా తమ గళాన్ని వినిపించాలని బాలస్వామి కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమ త్తంగా వ్యవహరించాలని బాలస్వామి విజ్ఞప్తి చేశారు.