27 April, 2026 | 8:48 PM

సహకరించిన ఆర్యవైశ్యులకు ధన్యవాదాలు

27-04-2026 07:13 PM

నాయకుడు బోనాల సైదారావు

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మట్టపల్లి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం వద్ద గల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కార్యవర్గం ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి పదవులకు నామినేషన్ వేసేందుకు సహకరించిన ఆర్యవైశ్యులకు నాయకుడు బోనాల సైదారావు సోమవారం ధన్యవాదాలు తెలిపారు. గత 17 సంవత్సరాలుగా వాసవీ క్లబ్ తో పాటు ఆర్య వైశ్య సంఘాల్లో కీలకంగా ఉంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న తనపై ఉన్న నమ్మకంతో ఆదరించిన ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.