7 July, 2026 | 2:59 AM

ఆర్థిక సవాళ్లు

07-07-2026 01:56 AM
  1. మెట్రో ఫేజ్ 24 వేల కోట్లకు పైగా అవసరం
  2. ప్రహసనంగా నిధుల సమీకరణ
  3. ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనంపైనే అందరి దృష్టి
  4. కేంద్ర ప్రభుత్వ సహకారమే అత్యంత కీలకం
  5. నివేదిక తర్వాతనే రుణాల లభ్యతపై స్పష్టత 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో ఫేజ్-- విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణ దశ కంటే ముందుగా ఆర్థిక సమీకరణ దశలోనే కీలక మలుపు తిరుగుతోంది. నగర భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులోని ఫేజ్ భాగంగా చేపట్టే 76.4 కిలో మీటర్ల విస్తరణకు గానూ అంచనా వ్యయం రూ. 24 వేల కోట్లకు పైగా ఉండటంతో, అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమీకరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది.

ప్రస్తుతం తెలం గాణ ప్రభుత్వం ఒకే వనరుపై ఆధారపడకుండా బహుళ ఆర్థిక వనరులను వినియోగించడం వంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ, కేంద్ర ప్రభుత్వ            భాగస్వామ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాలు, దేశీయ బ్యాంకుల రుణాలు, మెట్రో అనుబంధ వాణిజ్య ఆదాయాలు, భూముల అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాలను కలిపి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక రూపొందుతోంది. అయితే ఈ ఆర్థిక నమూనా ఎంత వరకు ఆచరణ సాధ్యమవుతుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

నిధుల సమీకరణ ఎలా?

హైదరాబాద్ మెట్రో ఫేజ్- ప్రాజెక్టును వేగవంతం చేసిన నేపథ్యంలో ప్రాజెక్టుకు కావాల్సిన ‘రూ.24 వేల కోట్లకు పైగా నిధులను ఎలా సమీకరించాలి’ అనేది ప్రస్తుతం ప్రభుత్వానికి అతిపెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ‘మల్టీ -సోర్స్ ఫండింగ్ మోడల్’ వైపు అడుగులు వేస్తోంది. అంటే ఒకే వనరుపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ, కేంద్ర ప్రభుత్వ సహాయం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణాలు,

దేశీయ బ్యాంకుల రుణాలు, ప్రైవేట్ పెట్టుబడులు, మెట్రో స్టేషన్ల వాణిజ్య అభివృద్ధి, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్(టీవోడీ) ద్వారా వచ్చే ఆదాయాలను కలిపి ప్రాజెక్టుకు నిధులు సమీకరించే వ్యూహాన్ని పరిశీలిస్తోంది. అయితే ఈ వ్యూహం విజయవంతం కావాలంటే కేంద్ర ఆర్థిక భాగస్వామ్యం, ఎస్బీఐ క్యాప్స్ రూపొందించే నివేదిక, ప్రాజెక్టు ఆదాయ సామర్థ్యంపై రుణాలు ఇచ్చే సంస్థల విశ్వాసం కీలకం కానున్నాయి. 

ఎస్బీఐ క్యాప్స్‌పైనే దృష్టి

హైదరాబాద్ మెట్రో ఫేజ్- ప్రాజెక్టుకు నిధుల సమీకరణలో ఎస్బీఐ అధ్యయనం అత్యంత కీలకంగా మారింది. ప్రాజెక్టుకు ఎంత రుణం అవసరం? ఎంత మేరకు రుణం తీసుకునే సామర్థ్యం ఉంది? రుణాలను ఏ విధంగా సమీకరించాలి? అనే ప్రశ్నలకు ఈ అధ్యయన మే సమాధానం చెప్పనుంది. అందుకే ప్రభు త్వం, రుణదాతలు, పెట్టుబడిదారుల దృష్టి అం తా ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ నివేదికపైనే ఉంది. మొదటిగా ఫేజ్ మెట్రో ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువను ఎస్బీఐ అంచనా వేయనుంది.

ఇప్పటికే నిర్మించిన మెట్రో కారిడార్లు, స్టేష న్లు, డిపోలు, వాణిజ్య ఆస్తులు, భవిష్యత్ ఆదా య సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని మొత్తం విలువ ఎంత ఉందో నిర్ధారిస్తుంది. ఈ విలువ ఆధారంగానే రుణదాతలు ఎంత మేరకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తారన్నది తేలనుంది.

అంతేకాదు, ఫేజ్ పూర్తయిన తర్వాత ప్రయాణికుల సంఖ్య ఎంత పెరుగుతుం ది? టికెట్ ఆదాయం ఎంత ఉంటుంది? ప్రకటనలు, స్టేషన్లలో వాణిజ్య కార్యకలాపాలు, పార్కింగ్, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ద్వారా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? వంటి అంశాలపై కూడా సమగ్ర ఆర్థిక విశ్లేషణ చేయనుంది. ఈ అంచనాల ఆధారంగానే రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిశీలిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం సహకారం

కేంద్ర ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. రూ.24 వేల కోట్లకు పైగా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదానిపైనే ఆధారపడి చేపట్టడం ఆర్థికంగా సవాలుగా మారుతోంది. మెట్రో రైల్ విధానం ప్రకారం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, దేశీయ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కేంద్రం మద్దతు లభిస్తే ప్రాజెక్టుపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో పాటు తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు పొందే అవకాశాలు కూడా మెరుగవుతాయి.

మరోవైపు, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నేపథ్యంలో కేంద్ర సహకారం లేకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రాష్ట్రం భరించడం సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఎంత మేర నిధులు కేటాయిస్తుంది? ఏ రూపంలో సహాయం అందిస్తుంది? అనే అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ప్రాజెక్టు ఆర్థిక నిర్మాణం పూర్తిగా ఖరారయ్యే అవకాశం ఉంది.

అయితే కేంద్ర సహకారం మాత్రమే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. మెట్రో ఫేజ్- అవసరమైన భారీ నిధులను సమీకరించడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జపాన్‌కు చెందిన సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీతో, దీర్ఘకాలిక రుణాలు లభిస్తే ప్రాజెక్టుపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. 

వాణిజ్య ఆదాయాలూ అవసరమే

ప్రపంచవ్యాప్తంగా మెట్రో సంస్థలు నాన్-ఫేర్ రెవెన్యూ (టికెటేతర ఆదాయం)పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. హైదరాబాద్ మెట్రోలో కూడా స్టేషన్లలో వాణిజ్య సముదాయాలు, ప్రకటనలు, పార్కింగ్, రిటైల్ స్పేస్ లీజులు, ట్రాన్సి ట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్, మెట్రో కారిడార్ల వెంట భూముల అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచే వ్యూహంపై ప్రభుత్వం దృష్టి సారి స్తోంది. టికెట్ ఆదాయంతో పాటు ఈ వాణిజ్య ఆదాయాలు పెరిగితేనే రుణాల చెల్లింపు భారం తగ్గి, ప్రాజెక్టు దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

వాణిజ్య ఆదాయా లు ఆశించిన స్థాయిలో రాకపోయినా రుణాల చెల్లింపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, వ్యయ నియంత్రణ వంటి అంశాలు సమన్వయంగా అమలైతేనే మెట్రో ఫేజ్ దీర్ఘకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది.