7 July, 2026 | 10:42 AM

బిజీనపల్లిలో తీవ్ర విషాదం..!

07-07-2026 09:28 AM

వాష్ రూం అని వెళ్తూ బాలుడు జారీపడి మృతి. 

బిజినపల్లి జూలై 07:  బిజినపల్లి మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన ఈర్ల నాగరాజు (15) అనే బాలుడు మంగళవారం తెల్లవారుజామున వాష్ రూంకి అని వెళ్తూ ప్రమాదశావత్తూ కింద జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  ఈర్ల మల్లయ్య, చెన్నమ్మలకు నాగరాజు ఒక్కగానొక్క కుమారుడు. ఈ బాలుడు స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున వాష్ రూం వస్తుందని బాలుడు ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డికి వెళ్ళబోయాడు. నిద్ర మబ్బులో ఉన్న బాలుడు కింద ఉన్న నేలను సరిగ్గా చూసుకోక, తట్టుకొని కింద పడ్డాడు. గుండె భాగంలో, తలకు బలమైన గాయం కావడంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి