7 July, 2026 | 2:39 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాటకాలు

07-07-2026 01:51 AM
  1. కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డికి హఠాత్తుగా మమకారం ఎందుకో? 
  2. ఫాతిమా విద్యాసంస్థలపై చర్యలేవి? ఎంఐఎం ప్రసన్నం కోసమేనా?
  3. హైకోర్టు ఆదేశాలేమైనయ్?
  4. భారత జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్‌ఎస్ పార్టీ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. కాళే శ్వరం అవినీతిపై సీఎం రేవంత్‌కి కలిగిన ఈ హఠా త్తు  మమకారం వెనుక రహస్యం ఏంటో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాతిమా విద్యా సంస్థలపై చర్యలేవి అని ప్రశ్నించారు. పేదలకో న్యా యం.. ఎంఐఎంకు మరో న్యాయమా? వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్, ఎంఐఎం, హైడ్రా పక్షపాత వైఖరిపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రజాపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జియో టెక్నికల్ రిపోర్టులు, ఇతర సాంకేతిక పరీక్షల ద్వారా డ్యాం సేఫ్టీ చర్యల్లేవని ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ’ స్పష్టం చేసిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రిపేర్ పనులు ప్రారంభించకపోవడం వారి ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టును ఒక ‘ఏటీ ఎం’లా మార్చుకుని, కేవలం డబ్బు, అహంకారంతోనే తరతరాలుగా రాజకీయం చేయొచ్చని భా వించిందని విమర్శించారు.

ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిని పూర్తిగా మర్చిపోయారని, అక్కడ జరిగిన అవినీతిపై ఎలాంటి కఠిన చర్యలు లేకుండా, కేవలం కొందరు అధికారులపై నామమాత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకు న్నారని మండిపడ్డారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్ రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజ రై, శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై రేవంత్‌రెడ్డికి ఉన్న ఈ హఠాత్తు ‘మమకారం’ వెనుక రహస్యం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని, ఇరు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమా డుతున్నాయని ఆరోపించారు. 

ఫాతిమా విద్యాసంస్థలపై చర్యలేవి?...

హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా’ వ్యవహరిస్తు న్న తీరుపై రాంచందర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో హైడ్రా పేరుతో పేదవాళ్ల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం.. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎం ఐఎంకు సంబంధించిన ‘ఫాతిమా విద్యాసంస్థల విషయంలో స్పష్టంగా నిబంధనలను ఉల్లంఘించిందని, అదేవిధంగా స్వయంగా విద్యాశాఖ కూడా అనుమతులే లేవని కోర్టుకు తెలపడాన్ని ఆ యన గుర్తుచేశారు.

అంతేకాకుండా హైకోర్టు సైతం తప్పుపట్టిందని గుర్తుచేశారు. స్వయంగా హైడ్రా కూడా ఇది ఆక్రమణే అని అంగీకరించినప్పటికీ, అంత స్పష్టంగా కనబడుతున్న ఆ విద్యా సంస్థను, భవనాలను ఎందుకు కూల్చివేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎంతో ఉన్న దోస్తానా వల్లే ఈ వివక్ష చూపుతున్నా రని, హైడ్రా అంటే కేవలం పేదవాళ్ల ఇళ్లను కూల్చడానికే ఉందా అని దుయ్యబట్టారు. ఎంఐఎం అన్ని నిబంధనలు ఉల్లంఘించి, చెరువుల పక్కన కట్టడాలు కడితే హైడ్రా పర్మిషన్లు ఇస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలని, పేదవాళ్లకు ఒక న్యాయం, ఎంఐఎంకు ఇంకో న్యాయం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎంఐఎంకు చెందిన అక్రమ ఇన్‌స్టిటూషన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం, హైడ్రాపక్షపాత వైఖరి పై బీజేపీ ప్రజాపోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఏక్ దేశ్.. ఏక్ విధాన్.. ఏక్ ప్రధాన్ అనే మహోన్నత సంకల్పంతో అఖండ భారత సాధన కోసం జీవితాం తం శ్యామా ప్రసాద్ ముఖర్జి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.