సోనాల మండల కేంద్రంలో అర్ధరాత్రి దోపిడీకి యత్నం
తాళం పగలగొట్టి దోపిడీకి యత్నం...
మేల్కొన్న జనం దొంగల పరారీ
బోథ్,(విజయక్రాంతి): మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సోనాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్గా చేసుకొని ఆదివారం అర్ధరాత్రి దోపిడీకి. ప్రయత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు ఆదివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం పైన వచ్చిన ముగ్గురు దొంగలు గ్రామంలో తాళం వేసి ఉన్న దండారి వెంకటరమణ అనే ఉపాధ్యాయిని ఇంటి కి వేసి ఉన్న తాళం గడ్డపారతో తాళం పగలగొట్టారు. అయితే తాళం పగలగొడుతున్న శబ్దానికి చుట్టుపక్కల వారు లేవడంతో దొంగలు వచ్చిన బైక్ పైనే పరారయ్యారు.
ప్రతిరోజు వేల సంఖ్యలో జనం రాకపోకలు
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సునాల మండలం మీదుగా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు సోనాల మండలం మీదుగా మహారాష్ట్ర కు వెళ్లేందుకు అంతర్ రాష్ట్ర రహదారి ఉండడంతో వివిధ ప్రాంతాల నుండి జనం రాకపోకలు కొనసాగిస్తున్నారు అంతేగాక ఇక్కడి బస్టాండ్ నుండి నిర్మల్ ఆదిలాబాద్ ఇచ్చోడ బోత్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు వస్తు పోతున్నారు అయితే గ్రామానికి వివిధ పనుల నిమిత్తం మహారాష్ట్ర నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు మరోవైపు గ్రామం దినదినాభివృద్ధి చెందడంతో గ్రామానికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే విషయం గ్రామస్తులకి అంతు పట్టడం లేదు కొత్తగా వచ్చిన వారిని సైతం గ్రామస్తులు గుర్తుపట్టకపోవడంతో దినంలో గ్రామంలో తిరిగి పోయేవారు ఎవరనేది తెలియకుండా పోతుందని గ్రామస్తులంటున్నారు.....
తాళం వేసిన ఇండ్లు టార్గెట్
ఆదివారం అర్ధరాత్రి దొంగతనానికి ప్రయత్నించిన వారు దినంలో రిక్కీ నిర్వహించి రాత్రిపూట దోపిడీకి ప్రయత్నించినట్లు గ్రామస్తులు అంటున్నారు గ్రామానికి చెందినవారు ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళితే గమనించి దొంగతనాలకు పాల్పడే ఆస్కారం ఉంది దొంగ తనా లు జరగకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు సమీప బంధువులకు గాని ఇరుగుపొరుగు వారిగాని సమాచారం ఇచ్చి వెళ్లాలని పలువురు పేర్కొంటున్నారు.
అప్రమత్తత అవసరం
దొంగతనాలను కట్టడి చేసేందుకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ యల్ల బిందుజా సుధీర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం అర్ధరాత్రి. వచ్చిన దొంగలు వెళ్లిపోతుండగా సీసీ కెమెరాలు రికార్డు కావడం జరిగిందన్నారు. కాగా దొంగలు వారి వెంట తీసుకువచ్చిన గడ్డపార చెప్పులను విడిచిపెట్టి పారిపోయారు సీసీ కెమెరా లో అర్ధరాత్రి ఒంటిగంట 30 నిమిషాలకు వచ్చి నట్లు రికార్డు కావడం జరిగిందని పేర్కొన్నారు. రాత్రిపూట మండల కేంద్రంలో పోలీసు గస్తీ పెంచాలని కోరారు ముఖ్యంగా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు






